రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - భూ రక్ష పథకం ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్థి - మేడా
రాజంపేట, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని., రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన " వైయస్సార్ జగనన్న శాశ్విత భూహక్కు, భూ రక్ష" పథకం ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తిపలక వచ్చునని శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పోలి పంచాయతీలోని సీతారామపురం గ్రామంలో వైయస్సార్ జగనన్న భూ శాశ్వత హక్కు.., భూ రక్షణ ద్వారా మంజూరైన పత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 132 మంది రైతులు పత్రాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన శాశ్విత భూహక్కు పథకం ద్వారా దళారీ వ్యవస్థను పారద్రోలడమే కాకుండా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా భూములు రీ సర్వే చేయడం జరిగిందని తెలిపారు.
దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో కార్స్ టెక్నాలజీ వినియోగించి అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను సరి చేయడం జరిగిందని అన్నారు. భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు తయారు చేయడం జరిగిందని అన్నారు. సర్వే నెంబర్ల వారీగా హద్దురాళ్ళు లేకపోవడం వలన సరిహద్దుల్లో తగాదాలు జరిగేవని.. తగాదాలకు స్వస్తి పలుకుతూ ప్రస్తుతం జగనన్న శాశ్విత భూహక్కు, భూ రక్షణ పథకం ద్వారా ఉచితంగా హద్దురాళ్ళు నాటించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా భూ విభాగాలు తగ్గుదల చేయడంతో పాటు భవిష్యత్తులో సులభంగా లావాదేవీలు చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళి రెడ్డి, ఆర్డీవో కోదండరామిరెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, వైకాపా నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పోలి వెంకటసుబ్బారెడ్డి, పోలి మురళి రెడ్డి, మందరం వేణుగోపాల్ రెడ్డి, మందరం గంగిరెడ్డి, రాజమోహన్ రెడ్డి, సర్వేయర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments