అన్నమయ్య జిల్లా, రాయచోటి (ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, విలేకరి)
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే మాసం రంజాన్, ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే మాసం రంజాన్ అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రంజాన్ మాసపు తొలి శుక్రవారం సందర్భంగా రాయచోటి పట్టణంలోని మసీదులో ముస్లిం సోదరులతో కలసి నమాజ్ లో పాల్గొన్నారు .ఉపవాస దీక్ష (రోజా)తో ఆయన నమాజ్ ప్రార్థనలు చేశారు.ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో దైవ చింతన తో నెల రోజుల పాటు నియమబద్ధ జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు, సానుభూతి, సేవాభావం వంటి సద్గుణాలు అలవడడంతోపాటు జీవితంలో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిస్వాసం పెంపొందుతుందన్నారు. శుభాలు వర్షించే వరాల వసంతం రంజాన్ అని ఆయన అన్నారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, బేపారి మహమ్మద్ ఖాన్, కొలిమి ఛాన్ బాష, ఫయాజ్ అహమ్మద్,ఎస్ పి ఎస్ రిజ్వాన్, రియాజ్,గౌస్ ఖాన్, సాదక్ అలీ, జాఫర్ అలీ ఖాన్, అల్తాఫ్, నవరంగ్ నిస్సార్, జబీవుల్లా, ఖాదర్ వలీ, నాదర్ తదితరులు పాల్గొన్నారు.
Comments