-- విద్యకు సీఎం జగన్ పెద్దపేట.
--- బాలల దినోత్సవం లో మండల కన్వీనర్
చెవ్వు.శ్రీనివాసులు రెడ్డి
భవిష్యత్ తరాల దేశ సంపదకు మూలమైన బాలల ఉజ్వల భవిష్యత్తు మంచి చదువుతోనే సాధ్యపడుతుందని వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మంగళవారం చిట్వేలి మండల పరిధిలోని నేతివారి పల్లి గ్రామ పాఠశాల లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో వైసీపీ మండల కన్వీనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.తాను మాట్లాడుతూ చిన్నపిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని తల్లిదండ్రులు ఆచరించే పద్ధతులను పిల్లలు అనుసరిస్తారన్నారు.
వారి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
పిల్లల చదువుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని విద్యా కానుక,విదేశీ విద్య కోసం విద్యాదీవెన, గోరుముద్ద లాంటి పలు కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న కీర్తి సీఎం జగన్ కే చెల్లుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ,నందలూరు భాస్కర్ రెడ్డి,ఎం.కనక రాజు, శుభద్రమ్మ,రెడ్డయ్య. పిచ్చిరెడ్డి, నందలూరు సుబ్బారెడ్డి, నందలూరు వెంకటసుబ్బారెడ్డి, కంది సుబ్బరాయుడు, లక్కిరెడ్డి యానాది రెడ్డి, ఎంపీటీసీ చంగల్ రాయుడు, ఓబిలు సుబ్బమ్మ, కమలాకర్, రమణ రెడ్డి , తుమ్మకొండ సుబ్రహ్మణ్యం,సర్పంచి రెడ్డయ్య ,కొండూరు రమేష్, లింగం శేఖర, బెల్లపు వెంకటసుబ్బయ్య, ప్రభాకర్, సర్పంచ్ సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
تعليقات