జిల్లా సత్వర చికిత్స కేంద్రం నందు ఘనంగా చిల్డర్న్స్ డే వేడుకలు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
జిల్లా సత్వర చికిత్స కేంద్రము జిల్లా ఆస్పత్రి ప్రొద్దుటూరు నందు చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు కంటి నిపుణుల సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహించి 18 మంది కంటి లోపాలు కలిగిన విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేశారు. వీరికి కంటికి తీసుకోవలసిన తగుజాగ్రతలను సూచించారు. అలాగే 15 మంది విద్యార్థులకు దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారికి చికిత్స చేసి, టూత్ పేస్టు బ్రష్ అందజేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులందరికీ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో RBSK డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్ రమేష్ ,ఆర్ బి ఎస్ కే డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ నవీన్ కుమార్ చిన్నపిల్లల వైద్యనిపులు డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ వాసంతి, ఆర్కేఎస్కే కన్సల్టెంట్ వెంకటరమణ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనూష, కంటి వైద్యులు ఎం.ఎస్ తేజ, జమీర్, ఆర్ కే ఎస్ కే సోషల్ వర్కర్ రామ్మూర్తి ,మరియు జిల్లా బాల భవిత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Comments