గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీరా
బాలల దినోత్సవం నాడు సేవ్ వైజాగ్ స్టీల్ అంటూ నినదించిన చిన్నారులు
ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాత, ఆధునిక దేవాలయాలుగా ప్రభుత్వ రంగ సంస్థలను కొనయాడిన భారత మొదటి ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా YSRTUC ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో బాలల దినోత్సవం వేడుకగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నెహ్రూ గారి విగ్రహానికి పూలమాలలు వేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సేవ్ వైజాగ్ స్టీల్ అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరియు ఇటీవల జరిగిన ముందస్తు అరెస్టులలో భాగస్వామ్యం అయిన మహిళలకు ఈ సందర్భంగా చిరు సత్కారం చేశారు.
ఈ సందర్భంగా YSRTUC ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప గారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అసమానతాలను తొలగించడానికి మరియు పారిశ్రామికంగా భారతదేశం ప్రపంచ పటంలో అభివృద్ధి చెందడానికి భారత మొదటి ప్రధాని నెహ్రూ గారి ప్రభుత్వ రంగ సంస్థలకు రూపకల్పన చేశారని, నేటి బాలలే రేపటి పౌరులుగా దేశ భవిష్యత్తును నిర్మిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వై వరలక్ష్మి, అరుణకుమారి, పిట్టా రమణమ్మ, ఉరుకుటి సుభాషిని, మామిళ్లపల్లి పద్మలత, బంటుపల్లి ఉషారాణి, బి వాణి, వై మస్తానప్ప, పరమానంద బిసాయి, మొగలయ్య, ఎంగల కోటి ప్రకాష్, పాలకీర్తి బ్రహ్మయ్య, చంద్రశేఖర్ శకునాల, జమ్మన మోహన కుమార్, తానేటి చంద్రశేఖర్, చిరంజీవి యాదవ్, పిట్ట రంజిత్, వంకర వరప్రసాద్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments