ఘనంగా విస్డమ్ పాఠశాలలో బాలల దినోత్సవం
నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని విస్డం స్కూల్ నందు బాలలకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వలిమి రాధ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఆటపాటలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామము, ఆటలు పాటలలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే వారికి మానసికల్లాసం కలిగి సర్వతో ముఖాభి అభివృద్ధి చెందుతారని, విద్యలో చురుకుగా ఉంటారని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చొక్కా రాజు వెంకట రవీంద్ర రాజు పాల్గొని, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లల పట్ల అమిత ప్రేమ కలిగిన వారిని, నేటి పిల్లలే రేపటి పౌరులనీ, భావి భారత శాసనకర్తలని తెలిపారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచి వందన సమర్పణ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కార్తీక్, త్రివేణి, మస్తానీ, పుష్ప, లక్ష్మీ, గాయత్రి, హసీన్ మరియు తానాజ్ మొదలగువారు పాల్గొన్నారు.
Comments