చిట్వేలు మండలం రాజుకుంట పంచాయతీ చింతలచెలిక గ్రామం లో ఎంపీ సీఎం రమేష్ నిధులతో 2019 నిర్మితమైన వాటర్ ప్లాంట్.. మిషనరీ మరమ్మతులు వల్ల గత కొద్ది నెలలుగా మూతపడింది. కాగా రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాల ప్రకారం రాజుకుంట గ్రామ వాసి మాదినేని చిన్నా రాయల్ తన సొంత నిధులతో మరమ్మతులు చేసి, గ్రామ ప్రజలకు ఈ రోజు ఉదయం త్రాగునీటిని అందజేశారు.
తాను మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభం కావడంతో త్రాగు నీటి సమస్య అధిగమించేందుకు పూర్తిస్థాయిలో మిషనరీలను మరమ్మతులు చేయడం జరిగిందని. ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
చింతలచెలిక గ్రామ ప్రజలు మాట్లాడుతూ, గ్రామంలో చేతిపంపుల స్థానంలో సింగల్ ఫేస్ మోటర్లు అమర్చినీటి ఎద్దడిని, త్రాగునీటి శుద్ధజలం నిర్మాణంతోపాటు దానికి కావలసిన ఖర్చులను చిన్న రాయల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని.. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కు మరియు చిన్నారాయల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
Comentarios