మదనపల్లె మండలం, కోళ్ళ బైలు పంచాయతీ, అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వెలుగు చిన్నారులకు యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి అవగాహన కల్పించడానికి క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసి విద్యుద్దీ పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శారీరక వికలత్వం గల శ్యామ్ ప్రార్థనతో ప్రారంభించగా, ప్రిన్సిపాల్ లీనాకుమారి బైబిల్ గురించి , క్రిస్మస్ చెట్టు ఆవశ్యకతను గూర్చి, నక్షత్రం యొక్క గొప్పతనాన్ని గూర్చి తెల్పారు. క్రీస్తు ఎక్కడ, ఎందుకు , ఎవరి కోసం పుట్టారో పిల్లలకు తెలియజేశారు. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించిన రోజు అనీ, మన పాపాలను పోగొట్టి మనల్ని రక్షించడానికి లోకరక్షకుడు ఉదయించిన దినం అని తెల్పారు. చి ధనిక దూత అలంకారంతో చిన్నారులను అబ్బురపరిచింది. భక్తిపాటలు పాడి, చివర ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.
అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ను కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. కేక్ ను, పండ్లు పిల్లలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం వెలుగు సెక్రటరీ శ్రీ యం. ఉదయ మోహన్ రెడ్డి, కన్వీనర్ శ్రీమతి భాగ్యలక్ష్మి, వెలుగు చిన్నారులు, సిబ్బంది, వెలుగు వృద్ధమహిళలు పాల్గొన్నారు .
Comments