top of page
Writer's picturePRASANNA ANDHRA

బీసీలపై దౌర్జన్యాన్ని సహించేది లేదు - చిట్టి పోయిన సుబ్రహ్మణ్యం యాదవ్

జాతీయ బిసి రాష్ట్ర కార్యదర్శి చిట్టి పోయిన సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ బీసీలపై దౌర్జన్యాన్ని సహించేది లేదు కాకినాడ నగరంలోని పర్లోపేట శివారు కాలనీ కి 2002 సంవత్సరం నుండి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టినారు ప్రభుత్వ రేషన్ కార్డులో ఆధార్ కార్డుల్లో కూడా ఇంటి అడ్రస్ లో జ్యోతిరావు పూలే కాలనీ అని గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ కాలనీకి జ్యోతిరావు పూలే పేర్లు మార్చి కమిషనర్ స్వప్నిలు దినకర్ పుoడ్కార్ గారి పేరును బలవంతంగా పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరుండి ఈ పేరును మార్పించారు అని జ్యోతి రావు పూలే గారి పేరును మార్చడం తప్పు అని ఇది ముమ్మాటికీ బీసీలను ఘోరంగా అవమానించడమేనని సాయి కుమార్ యాదవ్ అనే బీసీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి విలేఖర్లకు చెప్పి నాడని అతనిపై కక్షపూరితంగా అతని ఇంటి ముందున్న గోడలు పడగొట్టారు ఎటువంటి ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండా పగలగొట్టడం ఇది చాలా దారుణం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగల్ రావు యాదవ్ అన్న రామచంద్ర యాదవ్ ఆవుల నరసింహ గారు నాయకులు కాకినాడ వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలిపే జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలదండ వేయడానికి వెళుతుంటే పోలీసులు నిర్ధాక్షణ్యంగా అరెస్టు చేసి దౌర్జన్యంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ విధానాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది పోలీసుల వైఖరి మున్సిపల్ అధికారుల వైఖరి మారాలి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి బీసీల అంటే ఎందుకంత అలుసు బీసీల బహుజనుల నాయకుడు జ్యోతిరావు పూలే గారి పేరును తొలగించి చాలా పెద్ద తప్పు చేశారు ఇది ముమ్మాటికీ బహుజనులను బీసీలను ఘోరంగా అవమానించడమే నీ దుస్సాహసం కాండను ఆపాలి బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలను ఇబ్బంది పెడతావా రావణ కాండను ఆపకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ వైసీపీ ప్రభుత్వం బీసీల వెన్నెముకని చెప్పి బీసీల వెన్ను విరుస్తున్నారు పై విషయం మొత్తం ఏపీ ప్రభుత్వానికి తెలియజేసి జ్యోతిరావు పూలే గారి పేరును ఉంచాలని దీనికి గాను ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీసీల అంటే ఏమిటో తెలిసేలా చేస్తామని హెచ్చరించారు.


33 views0 comments

Bình luận

Đã xếp hạng 0/5 sao.
Chưa có xếp hạng

Thêm điểm xếp hạng
bottom of page