అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన బిజెపి నాయకులకు ససేమిరా అన్న గిరిషం.
--అధికారి కొందరికేనా, అందరికీ కాదా అంటూ బిజెపి నాయకుల ప్రశ్న?
--మా ఆవేదన ప్రభుత్వ కార్యదర్శి కి తెలపాలంటూ మండల డిప్యూటీ తాసిల్దార్ మురళి కి వినతి పత్రం.
అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని మండలాలలోని ప్రజా సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో నడుం బిగించిన బిజెపి నాయకులకు నిన్నటి రోజున తీరని పరాభవం ఎదురయింది.
దీనిపై అసంతృప్తిని వ్యక్తపరుస్తూ.. జిల్లా కలెక్టర్ అందరికీ కాదా?? కొందరికీనా?? అని ప్రశ్నిస్తూ చిట్వేలి మండల బిజెపి అధ్యక్షులు ఆకేపాటి వెంకటరెడ్డి, బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు తొంబరపు సుబ్బరాయుడు మరియు మండల బిజెపి నాయకులతో కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. మా వివరణ తెలపాలంటూ మండల డిప్యూటీ తాసిల్దార్ మురళికి కి వినతి పత్రాన్ని సమర్పించారు.
తరువాత మండల పాత్రికేయులతో వారు మాట్లాడుతూ ... నిన్నటి రోజున 14/7/2022 న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న మేము కలెక్టర్ తో కలవడానికి సహా సిబ్బంది ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నామని;మరి కొద్ది సేపట్లో మీరు కలవచ్చని తెలిపిన అక్కడ సిబ్బంది సుమారు మూడు గంటలు గడిచిననూ కలెక్టర్ పిలవకపోవడంతో తిరిగి సిబ్బందిని అడుగుతున్న మాకు స్వయంగా కలెక్టర్ నుంచే తీవ్ర పరాభం ఎదురైందని మాతో పాటు వచ్చిన అందరికీ అనుమతి లభించిననూ; కేవలం బిజెపి నాయకులమన్న నెపంతో మమ్మల్ని తిరస్కరించారని; కలెక్టర్ గిరీష మాట్లాడుతూ మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదని కరాకండిగా చెప్పడంతో చేసేది ఏమీ లేక తిరిగి రావడం జరిగిందని అన్నారు.
దీనిని బట్టి అధికారుల తీరు ఎలా ఉన్నదో అర్థమవుతుందని పాలకులకే తప్ప ప్రజలకు విలువ లేదని రానున్న రోజుల్లో బిజెపి పరిపాలన కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా విస్తరించడం ఎంతైనా అవసరం ఉందని పేర్కొంటూ.. తమ నాయకులు సాయి లోకేష్ నందలూరు,ఓబులవారిపల్లి మండలాలలో ఎక్స్ప్రెస్ రైల్లు నిలుపుదలకు చేసిన కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు దిలీప్ కుమార్, పగడాల నరసింహులు, శివ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
コメント