"ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు" వారు ప్రవేశపెట్టిన ఇంటింటికి ఔషధ మొక్కలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిట్వేల్ మండల పరిషత్ ప్రాంగణంలో ఎంపీడీవో సమతా , ఫారెస్ట్ అధికారి లింగారెడ్డి చేతుల మీదుగా వివిధ పంచాయతి సర్పంచ్ లకు , ఎంపీపీ, వైస్ ఎంపీపీ లకు మొక్కలను పంపిణి చేశారు.
సి హెచ్ ఎస్ కార్యదర్శి గాడి ఇంతియాజ్ మాట్లాడుతూ ఇంటింటికి ఔషధ మొక్కల పెంపకం వలన పెరటిలోనే వైద్యం అందుబాటులో ఉంటుందని అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని , "పర్యావరణ పరిరక్షణ మానవాళి సంరక్షణ" అని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు సమతా , నాగభూషణం , మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి , ఎంపీపీ చంద్ర , వైస్ ఎంపీపీ సుబ్రమణ్యంరెడ్డి, రాజుకుంట సర్పంచ్ గుత్తి నరసింహ , చిట్వేల్ ఉపసర్పంచ్ ఉమా మహేశ్వర రెడ్డి , లింగం లక్ష్మికర్, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రమణ , చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సభ్యులు కందుల నరసింహ నాయుడు ,గాలా శివారెడ్డి ,మరియు ఇంతియాజ్ పాల్గొన్నారు.
Comments