ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ చేపట్టే... కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేద్దాం - చిట్వేలు మండలం జనసేన పార్టీ నాయకులు.
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగవ విడత కౌలు రైతుల భరోసా యాత్రను కడప జిల్లాలోని సిద్దవటం నందు జరుగుతున్న సందర్భంగా గురువారం నాడు చిట్వేల్ లో జమసేన పార్టీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
సందర్భంగా చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ, సుధీర్ రెడ్డి, పురం సురేష్, పగడాల శివ తదితరులు మాట్లాడుతూ... 161 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని; చనిపోయిన ప్రతి కౌలు రైతుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తన చేతులు మీద లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నారనీ; అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం లో 17 మంది ఆత్మహత్య చేసుకోగా; చిట్వేలు మండలంలో ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారనీ వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఈనెల 20 తేదీన ఆర్థిక భరోసా సాయాన్ని ఇవ్వడం జరుగుతుందనీ అన్నారు.
రైతుల కష్టం వారి కన్నీటి విలువ తెలిసిన ప్రజా నేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ద్వారా రైతన్నల కుటుంబాలలో వెలుగును నింపి వారి మనసులో చెరగని ముద్రను ఏర్పాటు చేసుకుంటారని వారు అన్నారు. దేశానికి రైతే వెన్నుముక అన్న సత్యాన్ని నమ్మి అకారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ధైర్యాన్ని నింపుతూ వారికి ఆర్థిక భరోసా చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని అన్నారు.
ఇప్పటివరకు , ఉభయగోదావరి రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలలో మరియు ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం ఆరు విడతగా రాయలసీమలోని ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, భారీగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్వేలు జనసేన పార్టీ నాయకులు తుపాకుల పెంచలయ్య, షేక్ రియాజ్, మాదాసు శివ, పగడాల భరత్, మురళీకృష్ణ, చిరంజీవి, నరసింహ, కడుమూరి నాగరాజా, మాదినేని హరి, నాగిశెట్టి శివకుమార్, తిరుమల శెట్టి హరి, పవన్ రాజు,సువారపు హరి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు ..
Comments