top of page
Writer's pictureDORA SWAMY

అంగన్వాడి చిట్వేలు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

అంగన్వాడి చిట్వేలు మండల కమిటీ  ఏకగ్రీవ ఎన్నిక! సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!!


అన్నమయ్య జిల్లా  చిట్వేల్ మండలం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సి ఐ టి యు అనుబంధం,  ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో నూతన మండల కమిటీ  ఎన్నుకున్నట్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్ ప్రకటించారు. అధ్యక్షురాలిగా పగడాల సుధామణి, ప్రధాన కార్యదర్శిగా, వై. సుజాత, కోశాధికారిగా,  జి. సుబ్బా రత్నమ్మ, ఉపాధ్యక్షులుగా,  వి.సుధా వతి,  డి.నాగరత్న, సి. శాంతమ్మ, ఏ. సరస్వతి,  బి.శ్యామల.  జె. సులోచన, సహాయ కార్యదర్శులు గా, ఓ.సుజనా, ఎస్. రాధా, డి. రమణ కుమారి, కె చంద్రమ్మ, జి. లలిత. ఎం. శ్రీదేవి, మరో 22 మంది ని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కమిటీ సభ్యులు పి రాజేశ్వరి,  కె. సాయి కుమారి, కే సుభాషిని, పి. సుబ్బలక్ష్మి,  కె.ఉమాదేవి, ఎల్ ప్రభావతి, కే సుజాత,  జె. ఈశ్వరమ్మ,  జీ రాధా,  ఎన్. స్వప్న,  ఎం. సుదర్శన్ మ్మ,వి. లక్ష్మీదేవి, పి.మస్తానమ్మ, జి.విజయ్, డీ.లక్ష్మీదేవి,  డి. వెంకటసుబ్బమ్మ, ఏ.శాంతి, జి. సుబ్బా రత్నమ్మ, పి, రాధా, సి సుబ్బలక్ష్మమ్మ, జె. జయ సుధా,వి.శారద,  తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్, దాసరి జయచంద్ర, అంగన్వాడీ యూనియన్ కోడూరు ప్రాజెక్ట్, గౌరవ అధ్యక్షురాలు,  జి. పద్మావతి, అధ్యక్షురాలు,  ఎన్.రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా, ఎస్ .శ్రీ లక్ష్మి, ఓబులవారిపల్లె మండలం  ప్రధానకార్యదర్శి, టి రాధాకుమారి. తదితరులు పాల్గొన్నారు.


చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులు కార్మికులు, ప్రజల పైన, పన్నుల భారం, ధరల భారం, మో పారని, కనీస వేతనాలు మాత్రం పెంచకుండా, గౌరవ వేతనం పేరుతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు  వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించి,  పెంచకుండా మోసం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ముందర, తమ ప్రభుత్వ అధికారులకు వస్తానే తెలంగాణ కన్నా  వెయ్యి రూపాయలు  అదనంగా పెంచుతానని, మాట చెప్పి, మూడు సంవత్సరాలు జరిగినా, వెయ్యి రూపాయల మాత్రం పెంచి , మాట తప్పారు అన్నారు. 

తెలంగాణ కన్నా, నాలుగు వేల రూపాయలు తక్కువ ఇస్తున్నారని, చెప్పిన మాటకు కట్టుబడి తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కన్నా, ఈ ప్రభుత్వంలో అంగన్వాడీల పై వేధింపులు, పని భారం పెరిగింది అన్నారు. కనీస వేతనం సాధించేవరకు, హక్కులకోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, గ్రాట్యుటీ చెల్లించాలని,  ఐదు సంవత్సరాలు టి ఎ ,డి ఎ, చెల్లించాలని, కూరగాయల బిల్లులు, విడుదల చేయాలని, సూపర్వైజర్ పోస్టులు, నోటిఫికేషన్ ఇచ్చి జరపాలని,  సొంత బిల్డింగులు నిర్మించాలని, అంతవరకూ,ఇంటి అద్దెలు. పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు.

90 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page