ఈరోజు ఉదయం చిట్వేలు మండల పరిధిలోని ఎంపీడీవో సభా భవనం నందు ఎంపీపీ చంద్ర ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభను నిర్వహించేందుకు " కోరం" లేకపోవడంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభం అయింది. హాజరైన గ్రామాల ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల సమస్యలను తెలియపరచగా.. వివిధ శాఖల అధికారులు సమస్యల పై వివరణ ఇచ్చారు.
ఉపాధి హామీ ఎపిఓ చంద్రకళ మాట్లాడుతూ ఉపాధిహామీ నందు రైతులకు డ్రాగన్ ఫ్రూట్, పువ్వులు సాగు తదితర నూతన పంటలను సాగు విషయంలో ఉపాధి హామీ ద్వారా పూర్తి స్థాయిలో సబ్సిడీలు అందుతాయని దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైయస్సార్ జలకల ద్వారా ఎంపిక చేయబడ్డ గ్రామాలలో రెండున్నర ఎకరాలు విస్తీర్ణం గల రైతులకు ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం లోనూ 90 రోజుల ఉపాధి పని దినాల ను అందరూ ఉపయోగించుకోవచ్చు అన్నారు.
ఐ సి డి ఎస్ అధికారిని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 72 అంగన్వాడి సెంటర్ ఉన్నాయని.. పిల్లలకు, గర్భిణీ లకు సకాలంలో పౌష్టికాహారం అందించడంలోనూ వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలోనూ నిబద్ధతతో ఉన్నామన్నారు. వెలుగు అధికారిని గోవిందమ్మ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీ తోనూ మరియు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల ఎంపిడిఓ సమత,స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏ ఓ నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Comments