సి హెచ్ ఎస్ ఆధ్వర్యంలో.. ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి ప్రధమ,ద్వితీయ స్థానాల ఉత్తీర్ణలకు నగదు వితరణ.
--విద్యా దానం మహాదానమన్న సిహెచ్ఎస్ సభ్యులు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం లో "మానవసేవే మాధవసేవ" అన్న తలంపుతో అన్ని వర్గాల వారిని ఆపదలో అక్కున చేర్చుకుంటున్న సి హెచ్ ఎస్ సంస్థ ఈ రోజున ప్రభుత్వపాఠశాలలో చదివి..పదవ, ఇంటర్మీడియట్ లలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన వారిని ప్రోత్సహించాలన్న ద్వేయంతో కీర్తిశేషులు శ్రీమాన్ చెట్లూరు రామాచార్యులు మరియు కృష్ణమ్మ ల జ్ఞాపకార్ధం వారి మనవడు ఓ అజ్ఞాన దాత అందించిన సాయంతో సిహెచ్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుకరించారు.
ఇందులో భాగంగా ఈరోజు మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినిలయిన దివితా శివాని,ప్రీతి లకు ఒక్కొక్కరికి 4108 రూ.లు బహూకరించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.." విద్యా దానం మహాదానం" అని తమ సంస్థ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ తరఫున మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తమ లక్ష్యమని తమ వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామని తెలుపగా, వలసాని గోపాల్ మాట్లాడుతు ఇంటర్మీడియట్ లో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కూడా ప్రోత్సాహం అందిస్తామని తెలియజేశారు.
ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల స్పెషల్ అధికారిని రేవతి మరియు అధ్యాపక బృందం మాట్లాడుతూ సి.హెచ్.ఎస్ సంస్థ మొదటి నుండి తమ పాఠశాలకు కావలసిన సదుపాయాలను గుర్తించి ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని మరియు ఉత్తీర్ణులైన విద్యార్థులకు తోడ్పాటును అందించి వారికి చేయూత నివ్వడం చాలా ఆనందదాయకమని; చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఎస్ కార్యవర్గ కమిటీ సభ్యులు గాలా శివారెడ్డి, బొంతల శివనాగేశ్వరరావు,నాగిరెడ్డి తిరుమల్ రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పుల్లపుత్తూరు సురేష్ నాథ్ రెడ్డి,మహమ్మద్ ఇలియాజ్, బాలే మణి, చక్రవర్తుల వరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.
Comments