చుక్కారామయ్య హత్య కేసులో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు-రిమాండ్ కు తరలింపు.
--వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి.
సెప్టెంబర్ 11వ తేదీన చిట్వేలు మండల పరిధిలోని గట్టుమీద పల్లికి చెందిన చుక్కా రామయ్యను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం రాజును ఇప్పటికే అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపిన పోలీసులు సోమవారం రోజున హత్య కేసులో పాల్గొన్న మిగిలిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని చిట్వేలు పోలీస్ స్టేషన్లో డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి, సిఐ విశ్వనాథరెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి పాత్రికేయులకు నిందితుల వివరాలను వెల్లడించారు.
వీరిలో గూడూరు సుబ్రహ్మణ్యం రాజు, కుమార్, మహేష్ లు ముగ్గురు ప్రధాన నిందితునికి సహకరించినట్లు డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్య కేసును త్వరితగతిన చేదించిన సిఐ విశ్వనాథరెడ్డిని, ఎస్సై వెంకటేశ్వర్లును, పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను అభినందించారు.
ఆరోగ్య సమస్యలను మంత్రాలతో జయించడం కేవలం మూఢనమ్మకమని, తమకు అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా వెళ్లాలే తప్ప హత్యలకు పాల్పడడం, అట్టివారికి సహకరించడం శిక్షార్హమే అని, "జీవితం విలువైందని ప్రశాంతంగా జీవించడం" ముఖ్యమని ఈ సందర్భంగా డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కాటమయ్య, చిట్వేలి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Commentaires