సిఐటియు చిట్వేలు మండల కమిటీ ఆధ్వర్యంలో
విజయవంతంగా బంద్ నిర్వహణ - ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్.
ఈ రోజు ఉదయం కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా స్థానిక చిట్వేలి అంగన్వాడీ వర్కర్స్, ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్, గ్రామ సేవకుల సంఘం, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం, ఆటో యూనియన్, కాంగ్రెస్ పార్టీ తదితర సంఘాలతో కలిసి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్చార్జి గోశాల దేవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య మద్దతిచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు సుధామణి,సుజాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య లు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అనేక త్యాగాల తో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, కార్మిక చట్టాలను నీరుగారుస్తున్న బీజేపీ వైఖరి మారాలని.. నిత్యావసర వస్తువుల మరియు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలన్నారు.
డిమాండ్స్...
1)కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి.
2)నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.
3)పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.
4) విశాఖ స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలి.
5)ఉపాధి హామీ కూలి 600 రూపాయలు ఇవ్వాలి.
6) రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి తదితర డిమాండ్లతో కూడిన ప్రభుత్వానికి తెలపడమైనది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట అధ్యక్షులు సింగనమల రమేష్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు పగడాల భరత్ కుమార్,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సాయి,శంకరయ్య గ్రామ సేవకులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొరముట్ల సుధాకర్ మల్లికార్జున,ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాని,రమణ, నాగిరెడ్డి అంగన్వాడి టీచర్లు, ఆయాలు, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments