వై. ఎస్. ఆర్ కడప జిల్లా, కమలాపురం
పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే వారికి ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర రవాణా సంస్థలపై, ఇతర బల్క్,గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై ఇది మరొక దాడి అని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు శ్రీనివాసులురెడ్డి ఈ రోజు కమలాపురం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ . అంతిమంగా ఈ భారం ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే సామాన్యులపై పడుతుందన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలపై తాజా చర్య మరింత భారాన్ని మోపుతుందని అన్నారు. పెరుగుతున్న రవాణా వ్యయాలతో సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారనునాన్నయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలపై ఇది మరో తరహా దాడి అని వ్యాఖ్యానించారు. తక్షణమే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని తపన్సేన్ డిమాండ్ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో జరగబోయే సార్వత్రికసమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా ప్రభుత్వ రవాణా కార్మికులకు సిఐటియు పిలుపిచ్చింది.
పెట్రోలు,డీజిల్, గ్యాస్ కేంద్రంలోని బిజెపి సర్కార్ తీసుకున్న డీజిల్ బల్క్ బయ్యర్ల ధరల పెంపు నిర్ణయం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు గొడ్డలిపెట్టు వంటిదని . ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ పెంచిన ధరలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 24న నిరసనలు పాటించాల్సిందిగా అనుబంధ యూనియన్లు, సమాఖ్యలకు పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి.రమేష్ ఆటో యూనియన్ కార్యదర్శి మధ్యల.రాజేష్ ఎస్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Comentarios