చిట్వేలి ఈనెల 13వ తేదీన మైదుకూరులో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం(CITU) అనుబంధం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులను రద్దు చేసే ప్రయత్నం మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి , కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య కోరారు.
ఈ సందర్భంగా స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేసిన మణి,పెంచలయ్య లు మాట్లాడుతూ.. కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లో నమోదు చేసుకున్న కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష విడనాడాలని వారు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు లో ఉన్న అన్ని రకాల సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో దాదాపు లక్షమంది భవన నిర్మాణ కార్మిక రంగంలో పని చేస్తున్నారని; అరవై వేల మంది కార్మిక శాఖలో గుర్తింపు కార్డుల కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తుందని కారణంగా సంక్షేమ పథకాలు గుర్తింపు కార్డులు ఇతర హక్కులన్నీ నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా పని లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుపుతూ.. వెంటనే ఇసుక కొరత సమస్యను పరిష్కారం చేసి పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని అలాగే నిర్మాణ రంగంలో వాడే సిమెంట్ ,స్టీలు, ముడి సరుకుల ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె ఎన్ ఆంధ్రయ్య, సిపిఎం సీనియర్ నాయకులు మడగల ఆనందయ్య, కొరముట్ల నాగమణి, భువన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Comments