కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలో సీఐటీయూ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో కార్మిక ప్రజాసంఘాల పైన మోపుతున్న నిర్బంధాన్ని తక్షణమే ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు కడప నగరంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక రకాల హామీ ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయకపోవడం వల్లనే కార్మికవర్గం పెద్దఎత్తున పోరాటాలకు దిగుతున్నారని వారు పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు జరగలేదని అన్నారు. కార్మికులకు, ప్రజాసంఘాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారము నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. దీనిని ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేతకు గురిచేస్తున్నారన్నారు.
జిల్లాలో భవన నిర్మాణ కార్మిక నేతలు చంద్రారెడ్డి, సుబ్బారాయుడు, భైరవ ప్రసాద్ తో పాటు సీఐటీయూ కడప నగర కార్యదర్శి వెంకటసుబ్బయ్య తదితర అంగన్వాడీ, ఆశ, మునిసిపల్, భవన నిర్మాణ కార్మికులు తదితర సంఘాల నేతలను సరైన కారణం లేకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారని వారు విమర్శించారు. ఏ పోరాటం జరిగినా సీఐటీయూ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్బంధాన్ని ఆపాలని, లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ కడప నగర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. చంద్రారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. సుబ్బరాయుడు మునిసిపల్ యూనియన్ నగర అధ్యక్షుడు సుంకర రవి పాల్గొన్నారు.
Comments