భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి.
ఈనెల 23న మైదుకురులో జిల్లా మహాసభల విజయవంతానికి సహకరించండి. పులివెందులలో విలేకర్ల సమావేశంలో సీఐటీయూ నేతలు.
కడప జిల్లాలో సంక్షేమ బోర్డు లో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు అందరికీ తక్షణమే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సీఐటీయూ కడప జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) కడప జిల్లా కన్వీనర్ ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు.
ఆదివారం నాడు పులివెందులలో సంఘం కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇసుక కొరత కారణంగా పనిలేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఇసుక సమస్యలు పరిష్కారం చేసి పనులు పూర్తి స్థాయిలో దొరికేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో అనేక మంది సంకేమ బోర్డులో గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొన్నారని వారందరికీ తక్షణమే గుర్తింపు కార్డులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నిర్మాణ రంగంలో వాడే ముడిసరుకుల ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డులను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సివస్తుందని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు అమలు నిలిచిపోయాయని వారు అన్నారు. గుర్తింపు కార్డులు, సంక్షేమ నిధులు బోర్డు ద్వారా అమలు చేసే ప్రయత్నం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో మరిన్ని పోరాటాలు నిర్వహించేందుకు వీలుగా ఈనెల 23న మైదుకురులో సంఘం జిల్లా మహాసభలు జరుపుతున్నామని , వీటిని జయప్రదం చేసేందుకు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, పులివెందుల సీఐటీయూ నాయకులు ఎస్. ఏ. గపూర్, యూ. చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Comentários