మంగంపేట పునరావాస బాధితులకు న్యాయం చేయాలి! - సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్!!
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, మంగంపేట ఏపీఎండీసీ, డేంజర్ జోన్ పునరావాస బాధితులకు తక్షణం న్యాయం చేయాలని, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఇల్లు, భూములు, సంస్థ కు ఇచ్చి సహకరించిన బాధితులకు న్యాయం జరగక ఆఫీసుల చుట్టూ,అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారన్నారు, పరిహారం అందక పోయినా అందినట్లు రికార్డులో నమోదైనట్లు, ఆరోపణల పైన విచారణ జరపాలన్నారు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షిఫ్టింగ్ చార్జీల ఒక లక్ష పదివేలు, ఒక ఇంటికి మాత్రమే ఇచ్చి, మిగతా మూడు నాలుగు ఇళ్లకు, చెల్లించకుండా యాజమాన్యం మోసం చేసిందన్నారు. కొందరికి మాత్రం అన్ని ఇళ్లకు నష్ట పరిహారం షిఫ్టింగ్ చార్జీలు చెల్లించారు. బస్ స్టాండ్ ఏరియా లోనూ, అగ్రహారం లోనూ, సామాన్లు తరలింపు,రవాణా చార్జీలు, చెల్లించ లేదన్నారు. అగ్రహారం ను మూడుసార్లు తరలించారని, 2013 పునరావాస యాక్ట్ ప్రకారం, రెట్టింపు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డీ జెడ్ పర్సనల్ లు క్రింద 300 టన్ను బరైటీస్, 220 మంది బాధితులకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి, 8 లక్షల నుండి, పది లక్షల వరకు, ప్యాకేజీ కి సిఫారసు చేశారని, దాని అమలు చేయాలని కోరారు. ఉద్యోగం వద్దన్న వారికి వన్ టైం సెటిల్మెంట్ చేయాలన్నారు. మంగంపేట, అరుంధతి వాడ, ప్రజలకు, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లేవు అంటూనే, ఎమ్మెల్యేలు ఎంపీలు , మంత్రులు రెకమెండ్ చేసినవారికి,ఇతర జిల్లాల వారికి, ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. పునరావాసం వారి న్యాయమైన కోరికలకు పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు ఓబులవారిపల్లి మండల కన్వీనర్ దార్ల సుధాకర్ పాల్గొన్నారు.
Comments