top of page
Writer's pictureDORA SWAMY

గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం - సి.ఐ.టి.యు

గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం! సి ఐ టి యు విమర్శ!! - వైసీపీ ప్రభుత్వం లో పంచాయతీల పాత్ర శూన్యం. సిహెచ్ చంద్రశేఖర రావు.

వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలను, ఉత్సవ విగ్రహాలుగా తయారుచేశారని, అతి దారుణంగా గ్రామ పంచాయతీలు, నిధుల్లేక నివ్వెర పోతున్నాయని సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి  సిహెచ్. చంద్రశేఖర్, తీవ్రంగా విమర్శించారు.


అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు సిఐటియు ఆఫీసులో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ, 15వ ఫైనాన్సు  నిధులను జనాభా ప్రాతిపదికగా కేంద్రము నిధులు విడుదల చేస్తే, పంచాయతీల నుంచి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని ఇతర కార్యక్రమాలకు వాడుకున్నారని ఆరోపించారు. దాదాపు 10 వేల కోట్ల రూపాయలు, సంక్షేమ కార్యక్రమాల పేరుతో దారి మళ్లించారన్నారు.  గ్రామాలకు పట్టుకొమ్మలైన అభివృద్ధి కార్యక్రమాలు, చేయడానికి నిధుల్లేక,  సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉత్సవ విగ్రహం లాగా ఉన్నారని;కనీసం వీధిలైట్లు వేయాలన్న, కరెంట్ బిల్లు కట్టాలన్న, సిమెంటు రోడ్లు, కుళాయిలు బిగించాలన్నా, నిధుల్లేక, గ్రామాల్లో ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు.


సంక్షేమ పథకాల పేరుతో, అభివృద్ధి కార్యక్రమాలన్నియూ కుంటు పడ్డాయన్నారు. మూడు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్ లలో ఒక్క టెండర్ కూడా  పిలవ లేదన్నారు.  ముఖ్యమంత్రి వాడుకున్న  15 ఫైనాన్స్ నిధులను తక్షణం గ్రామ పంచాయతీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.  సిపిఎం పోరాట ఫలితంగా వచ్చిన,ఎస్సీ ,ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కూడా దళిత గ్రామాల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. వాటిని కూడా దారి మళ్లించారన్నారు.


వరదల్లో నష్టపోయిన పోయిన, బాధితులను ఆరు నెలలు జరుగుతున్నా ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. కోడూరు పట్టణంలోనే 30  ఇండ్లు వరదల్లో కొట్టుక పోతే, కనీసం నష్టపరిహారం గానీ, ఇంటి స్థలం గానీ ఇవ్వలేదన్నారు. సంక్షేమ పథకాల్లో కోత  విధించారని, అందరికీ అందలేదన్నారు. మరోపక్క ప్రజల పైన  భారాలు మీద భారాలు  వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పైన సొంత పార్టీలోనే, కార్యకర్తలు లోనే తీవ్రమైన అసంతృప్తి నెలకొందని ఆరోపించారు.


ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టి, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తు లకు నిధులు కేటాయించాలని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, సి ఐ టి యు ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య,  సి ఐ టి యు సీనియర్ కార్మిక నాయకులు,  మోడీ సుబ్బరామయ్య పాల్గొన్నారు.

17 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page