top of page
Writer's pictureEDITOR

పి.డి.ఎఫ్, ఎం.ఎల్.సి ల దీక్షకు సిఐటియు సంపూర్ణ మద్దతు

పి.డి.ఎఫ్, ఎం.ఎల్.సి ల దీక్షకు సిఐటియు సంపూర్ణ మద్దతు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


సిపిఎస్‌ విధానం రద్దుకై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు నిరసనగా పిడిఎఫ్‌, ఎం.ఎల్‌.సి.లు చేస్తున్న దీక్షలకు  సిఐటియు సంపూర్ణ మద్ధతు ఉంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలియజేశారు. ఆదివారం ఎన్జీవో కార్యాలయంలో వారు మాట్లాడుతూ సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పిడిఎఫ్‌, ఎంఎల్‌సిలు చేస్తున్న దీక్షలకు  సిఐటియు తన సంపూర్ణ మద్ధతు నిస్తుందని ప్రకటించారు. 

సిపిఎస్‌ను రద్దు చేయాలని గత 18 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టంగా హామీనిచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  హామీ ఇచ్చి మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పి జిపిఎస్‌ అంటున్నారని విమర్శించారు. జిపిఎస్‌ విధానం వలన ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు.


ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు ప్రశాంతంగా సంకల్ప దీక్షలు నిర్వహించకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం గర్హనీయమని, దుర్మార్గమని  విమర్శించారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని, గురువులపై నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలు, పిడిఎఫ్‌, ఎం.ఎల్‌.సి.లతో చర్చలు జరపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


8 views0 comments

תגובות

דירוג של 0 מתוך 5 כוכבים
אין עדיין דירוגים

הוספת דירוג
bottom of page