అంగన్వాడీలను అడ్డుకోవడం సరికాదు - సీఐటీయూ
రాజంపేట
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఛలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఐ సి డి ఎస్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా చిత్రాలు రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ 26 వేలు అమలు చేయాలని, ముఖ హాజరు రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ బండ ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 నుండి పెండింగ్ లో ఉన్న టి.ఏ బిల్లులు వెంటనే చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి ఐదు సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని అన్నారు.
Comments