విద్యార్థుల ఫీజుల కోసం, విద్యాసంస్థల వేధింపుల అరికట్టాలి! సి ఐ టి యు, ఎస్ ఎఫ్ ఐ డిమాండ్!!
ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఇంజినీరింగు, డిగ్రీ విద్యార్థుల నుంచి, ఫీజులు చెల్లించాలని, లేకుంటే పరీక్షలకోసం హాల్ టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహయ కార్యదర్శి, పి. జాన్ ప్రసాద్, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ సి ఐ టి ఆఫీస్ లోమంగళవారం విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఉన్నత విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , జగనన్న విద్యా దీవెన పేరుతో తల్లులు అకౌంట్ కి చెల్లిస్తున్నారు. కరోనా లో విద్యా సంస్థలు జరగలేదని కారణంతో విద్యా దీవెన పథకం కొన్ని కంతులు నిలిపివేశారని, మరో రెండు కంతులు చెల్లించాల్సి ఉందని, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు 29 నుంచి జరుగుతున్నాయని, ఆ ఫీజులో చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని, లేకుంటే ఇచ్చేది లేదని, యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయని, దీనితో విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలో ఉందన్నారు.
ప్రభుత్వం తప్పిదానికి విద్యార్థుల భవిష్యత్తు బలి అవుతుందని, ఆల్ టికెట్లు నిరాకరించిన యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, విద్యా దీవెన పథకం, ప్రభుత్వం చెల్లిస్తేనే, విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయాలని, డిమాండ్ చేశారు, వైసీపీ ప్రభుత్వం లో విద్యార్థులు అనేక సమస్యలతో, తప్పుడు విధానాలతో, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారని,ఫీజు రియంబర్స్మెంట్, యాజమాన్య అకౌంట్లో వేసి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.
Comments