న్యాయం పొందాలంటే చట్టాలపై అవగాహన అవసరం.
--చట్టం ముందు అందరూ సమానులే.
--అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
"సివిల్ రైట్ డే" కార్యక్రమంలో ఎమ్మార్వో మురళీకృష్ణ.
ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి భారత రాజ్యాంగ చట్టంలోని హక్కులను తెలియపరిచి వాటిపై అవగాహన పెంపొందిస్తూ మరియు వారికి కావలసిన అవసరాలను గుర్తించేందుకై ప్రతినెల నిర్వహించే "సివిల్ రైట్ డే" ను ఈ రోజున చిట్వేలు మండల తాసిల్దార్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని వైయస్సార్ ఎస్ టి కాలనీ లో మండల ఎస్సై వెంకటేశ్వర్లు, రెవెన్యూ, ఐసిడిఎస్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మురళీకృష్ణ మాట్లాడుతూ... భారత ప్రజాస్వామ్యంలో మనమంతా సమానమేనని; ఉన్నత, తక్కువ స్థాయి అన్న భేదాభిప్రాయం లేదని, ఏఒక్కరిపై చిన్న చూపు తగదని, రాజ్యాంగం ద్వారా సిద్ధించిన హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని, అంతేకాక ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టాలు ఉన్నాయని వాటన్నింటినీ అవసరమైనప్పుడు తప్పకుండా ఉపయోగించుకోవాలని మీ గ్రామాలలో ఉన్నత వర్గాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్ననూ తమకు తెలపాలని, అంతేకాక కనీస అవసరాలు అయిన నీరు, రోడ్లు,విద్య తదితర ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రస్తుతం ఆధునిక కాలంతో అందరూ పోటీ పడుతున్నారని కొన్ని వర్గాలు మాత్రం ఉన్నచోటనే ఉంటూ కాయ కష్టం చేస్తూ తిరిగి తమ పిల్లలను అదే వృత్తిని అలవాటు చేస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, అంతేకాక త్రాగుడు లాంటి వ్యసనాలకు బానిసలై ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారని వీటన్నింటికీ విరుగుడు " చదువు ఒక్కటేనని" అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏఎస్ఓ దామోదర్ నాయుడు, ఆర్ ఐ శేషం రాజు, గ్రామ రెవెన్యూ అధికారి ఉదయ్ కుమార్, ఐసిడిఎస్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Kommentare