పేదల పాలట పెన్నిధి కేకే రెడ్డి : వైఎస్ఆర్సిపి నాయకులు మదన్ రెడ్డి, రాజేంద్రరెడ్డి
సంక్రాంతి సందర్భంగా 300 మంది పేదలకు బట్టల పంపిణీ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల కేంద్రంలోని పెద్ద కారంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్, అమెరికా ఆటా ప్రోగ్రాం డైరెక్టర్ కే.కే రెడ్డి పేద ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు హర్షనీయమని వైఎస్ఆర్సిపి నాయకులు మదన్ మోహన్ రెడ్డి, వీరబల్లి ఎంపీపీ రాజేంద్ర రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు చిన్నపరెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. శనివారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భోగి పండుగ రోజున పెద్ద కారంపల్లి గ్రామపంచాయతీలో కే.కే రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఇష్టమైన పండుగ సంక్రాంతి అన్నారు. ఈ పండుగను పేద ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ నాడు పేద ప్రజలకు కే.కే రెడ్డి బట్టలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పుట్టి పెరిగిన సొంత ఊరిపై ఉన్న మమకారంతో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ చిన్నపరెడ్డి, జిల్లా అధ్యక్షులు రంగనాథ్ రెడ్డి, రాజంపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుబ్రమణ్యం రాజు, రాయలసీమ టూరిజం అసోసియేషన్ అధ్యక్షులు జనార్ధన రాజు మాట్లాడుతూ కే.కే రెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి పండుగ రోజున సుమారు 300 మంది మహిళలకు చీరలు, పురుషులకు రామ్ రాజ్ పంచలు, టీ షర్టులు పంపిణీ చేయడం సేవకు ప్రతిరూపం అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఎం.వి సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, డి.సుబోధ్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు కోదండ రెడ్డి, రఘునాధ రెడ్డి, వెంకటసుబ్బయ్య, రిటైర్డ్ ఎంఈఓ మేడా చెంగల్ రెడ్డి, నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments