top of page
Writer's pictureEDITOR

రాష్ట్రాన్ని దోచుకునేందుకు తోడేళ్లలా ఏకమై వస్తున్నారు: సీఎం జగన్‌

రాష్ట్రాన్ని దోచుకునేందుకు తోడేళ్లలా ఏకమై వస్తున్నారు: సీఎం జగన్‌

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవం సభలో విపక్షాలపై మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు తోడేళ్లలా ఏకమై వస్తున్నారని విమర్శించారు..

పేదల ప్రభుత్వం కావాలో.. పెత్తందారుల ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. వచ్చేది కురుక్షేత్ర సంగ్రామమని, ప్రజలే తమ సైనికులని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారని, విపక్ష నేతల మాటలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..


'' రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయమే తప్ప వ్యాపారం కాదని, ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి. అలాంటి నైతికత ఉంటే ఆ మనిషిని, ఆ గుండెను ఒక వైఎస్సార్‌ అని అన్నారు. ఒక జగనన్న అని అంటారు. అలాంటి నైతికత లేకపోతే ఒక చంద్రబాబు అని అంటారు. పాడి.. పంట ఉండే నాయకత్వం కావాలా? నక్కలు, తోడేళ్లు ఉండే నాయకత్వం కావాలా? ఆలోచించాలని కోరుతున్నా. రైతు రాజ్యం కావాలా? రైతును మోసం చేసే పాలన కావాలా? అని అడుగుతున్నా. సర్కారు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లే పెత్తందారులు కావాలో ఆలోచన చేయమని కోరుతున్నా'' అని జగన్‌ అన్నారు. కల్యాణదుర్గం సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్న జగన్‌.. తల్లి విజయమ్మతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు..

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page