వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని కమిషనర్ చాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, వివిధ అనారోగ్యాల సమస్యల చేత వైద్యానికి అయ్యే కర్చును వైసీపీ ప్రభుత్వ భరిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంగళవారం నాడు ముప్పై ఏడు లక్షల యాబై మూడు వేల రూపాయలు, ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాచమల్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ద్వారా ధరకాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తన చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించిందని అభిప్రాయ పడ్డారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ అమలు కాగా, నేడు ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పథకాన్ని అమలు చేస్తూ పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. ప్రొద్దుటూరు ప్రజల పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందువలనే నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు అమలు భేషుగ్గా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్ల ఇర్ఫాన్, కమాల్ భాష, పిట్టా బాలాజీ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments