ఏపీ సీఎం జగన్ ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చనిపోయాక కడప జిల్లా జనం నన్ను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేసామని, 22,212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కోసం 200 కోట్లు ఖర్చు చేసామని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా 515 కోట్లతో ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసామని, ప్రొద్దుటూరులో మైనార్టీలకు ఉర్దూ డిగ్రీ కళాశాల, ఎల్లాల ఆంజనేయస్వామి ఆలయం ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో వరద బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.
Comments