అమరావతి: రాష్ట్రంలో అనేక వ్యవస్థలూ దీనావస్థలో ఉన్నాయని, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు.
రాష్ట్ర పోలీసుల తీరును కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్‌తో చూస్తోందన్నారు. త్వరలో వ్యవస్థను ప్రక్షాళన చేసేలా చర్యలు ఉంటాయని తెలిపారు. అవసరమైతే కొందరు ఐపీఎస్‌లను కేంద్రం రీకాల్ చేస్తుందని తెలిపారు. శుక్రవారం ఆయన పలువురు భాజపా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ''ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఇక్కడేం జరుగుతుందో వివరించాం. వారు ఇక్కడ టెలిస్కోప్‌లో చూస్తున్నారు. త్వరలో ఈ పోలీస్ వ్యవస్థపై పెద్ద ప్రక్షాళన ఉంటుందని తెలియజేస్తున్నా. ఇకమీదట మీ ఆటలు సాగవు. ప్రజలకు ఏది న్యాయమైతే అది చేయాలి. మీకొక యాక్ట్ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణను ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభుత్వాలు ఉంటాయి.. పోతాయి. కానీ వ్యవస్థలు ఎప్పటికీ ఉంటాయి. వ్యవస్థలకు చెడ్డపేరు తీసుకురావొద్దని ఐఏఎస్, ఐపీఎస్‌లకు గుర్తుచేస్తున్నా'' అని తెలిపారు.
Comments