దైనందిన జీవితంలో ఆరోగ్యం ప్రధానమైనదని - రాచమల్లు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రజల దైనందిన జీవితంలో ఆరోగ్యం ప్రధానమైనదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు దాదాపు 5 లక్షల 35వేల రూపాయలను, 14 మంది లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం పేదరికం కారణంగా విద్యను అభ్యసించలేని శృతి అనే విద్యార్థినికి 34 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి అందుకున్న లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందుకున్న లబ్ధిదారు మాట్లాడుతూ తాను గతంలో ఆపరేషన్ కొరకు దాదాపు ఆరు లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేశానని, ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకోగా ఆమోదింపబడలేదని, కాగా ఎమ్మెల్యే రాచమల్లు చొరవతో నేడు లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల క్రింద మంజూరైనందుకు ఆనందం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పలువురు మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments