తన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని బోరున విలపించిన బాధితులు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామంలో నివసిస్తున్న గంజికుంట సంజీవరాయుడుకు చెందిన 125/2,3 సర్వే నంబర్ లో ఉన్న 38 సెంట్లు భూమిని ఆక్రమించిన మార్కాపురం వెంకటయ్య నుండి రక్షించి తమ భూమిని ఇప్పించాలని బాధితులు గంజికుంట సంజీవ రాయుడు బోరున విలపించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామపంచాయతీ మీనాపురం గ్రామం పొలం సర్వేనెంబర్ 125 2 3 8 సెంట్లు 125 4 52 సెట్ల భూమి యందు సాగు చేసుకునేవాడినన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల సర్వేనెంబర్ 125/2,3 కు బదులుగా 125/6 సర్వే నంబర్ తో 38 సెంట్లకు బదులు 50 సెంట్లు అని తప్పుగా నమోదు కాబడి ఉందన్నారు అదే గ్రామ పొలంలో మార్కాపురం వెంకటయ్య కు చెందిన 125/6 కు బదులు 125/2 అని నమోదు చేయబడిందన్నారు.
2011 మే 19న 125 బార్ రెండు నాది కాదు నా యొక్క సర్వే నంబర్ 125/6 అని సవరణ చేసి వెన్నపూస మహేశ్వర్ రెడ్డి కి మార్కాపురం వెంకటయ్య బుక్కపట్నం సుబ్బరాయుడు తో కలిసి అమ్మినట్లు తెలిసిందన్నారు. తిరిగి మార్కాపురం వెంకటయ్య కొత్తపల్లి విఆర్ఓ భాస్కర్ రెడ్డి కి పాత డాక్యుమెంటు 125/2 సర్వే నంబర్ చూపించి ఆన్లైన్లో నమోదు చేయించి మార్చి 24 2022న కోడూరు విక్రమ్ కుమార్ రెడ్డికి రిజిస్టర్ చేశాడన్నారు. దాసారెడ్డి శేఖర్ రెడ్డి వీఆర్వో భాస్కర్ రెడ్డి సహకారంతో మార్కాపురం వెంకటయ్య భూమిని విక్రయించాడని ఆరోపించారు. భూమిని కబ్జా చేసిన మార్కాపురం వెంకటయ్య పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవలే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూ అక్రమణల బాధితులు ఎవరైనా తన దృష్టికి తెస్తే న్యాయం చేస్తామన్న సంగతి తెలిసిందే. భూ అక్రమణ దారులపై విచారించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు అధికారులు తన భూమి తనకి ఇప్పించి తగు న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు.
Comments