తన పుత్రుడు సాయి తేజకు గుర్తుగా..
విద్యార్థులకు" సాయి తేజ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్" నిర్వహణ.
కనిపెంచిన తన పుత్రుడు ఆవుల సాయి తేజ ; ఉన్నత చదువులను పూర్తిచేసుకుని ఇంటికి వస్తాడనుకున్న తరుణంలో మిత్రులతో కలిసి సముద్రాన్ని చూడడానికి వెళ్ళిన సరదా తన పాలిట శాపంగా మారి తమ నుంచి దూరమై పుట్టెడు దుఃఖాన్ని నింపిన తమ బిడ్డ జ్ఞాపకాలకు గుర్తుగా... చిట్వేలి స్థానిక ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆవుల ప్రసాద్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన వివిధ పాఠశాలలోని ప్రాథమిక విద్యనభ్యసించే ఐదో తరగతి పిల్లలకు "సాయి తేజ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్" ను నిర్వహిస్తూ వారికి గణితం పై ఇష్టాన్ని కలిగీస్తూ పిల్లల అభివృద్ధిలో తాను సేవలందిస్తున్నారు.
తాను మాట్లాడుతూ...
తనకు గణితంలో ఉన్న అనుభవంతో ప్రాథమిక దశలో ఉన్న పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని వెలికి తీసి,గణితం పై పట్టు సాధించేందుకు, ప్రస్తుత పోటీ పరీక్షలలో నెగ్గేందుకు అవసరమైన అన్ని రకాల ప్రశ్నలతో కూడిన గణిత పరీక్షను నిర్వహిస్తున్నామని అన్నారు. గురువారం బాలుర సమీకృత వసతి గృహంలో నిర్వహించిన ఈ పరీక్ష నందు మండల వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాల నుంచి ఐదవ తరగతి పిల్లలు హాజరయ్యారని అన్నారు. ఈ పోటీ పరీక్షల లో ఉర్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 22వ తేదీన గణిత శాస్త్రవేత్త" రామానుజం" జయంతిని పురస్కరించుకొని విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తామని తెలిపారు.రాబోవు రోజుల్లో కూడా ప్రతి ఏడాది ఈ పరీక్షను కొనసాగిస్తామని అన్నారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన మండల విద్యాశాఖ అధికారి మహేశ్వరరావుకు, మండల పరిధిలోని వివిధ ప్రాధమిక పాఠశాల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాలేషా, బాలసుబ్రమణ్యం, సతీష్,భాష, శారద మరియు వార్డెన్ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు ప్రసాద్ సేవలను పలువురు అభినందించారు.
Comments