జిల్లా లో ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు.
----అపోహలు వద్దు -జాగ్రత్తలు తప్పనిసరి.
---జిల్లా అధికారి గుణశేఖర్ పిళ్ళై.
కడప మరియు అన్నమయ్య జిల్లాలలో ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని ప్రజలు అపోహ చెందవద్దని,కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్ళై పేర్కొన్నారు. మంగళవారం చిట్వేలి పశు శాఖ కార్యాలయం నందు ఉమ్మడి కడప జిల్లా పశు వ్యాధుల నిర్ధారణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, రాజంపేట డిడి విజయ భాస్కర్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి నెల్లూరు జిల్లా నందు వ్యాప్తి చెందిన క్రమంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నామని కోళ్ల దిగుమతి నెల్లూరు జిల్లా నుంచి పూర్తిగా నిరోధించడానికి జిల్లా సరిహద్దు అనుంపల్లి చెక్ పోస్ట్ వద్ద మమ్ముర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఉడికించకుండా సిద్ధం చేసిన కోడి మాంసాన్ని, గుడ్లను వాడొద్దని సూచించారు. ముఖ్యంగా కోళ్లల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలైన అధిక శాతం మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, తలవాపు, ముక్కు నోటి నుంచి ద్రవ స్రావం తదితర ఇబ్బందులను గుర్తించిన వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం 70 శాతం సబ్సిడీతో పశువులకు, గొర్రెలకు, మేకలకు అందిస్తున్న భీమాను ప్రతి పాడి రైతు ఉపయోగించుకొని అకాల జంతు మరణాల నుంచి ఉపశమనం పొందాలని కోరారు. పెంపుడు కుక్కలకు కు.ని ఆపరేషన్లు, సంబంధిత టీకాలు కావలసినవారు పశు వైద్య కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. పశువులకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు,దాణా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందవచ్చన్నారు.
తదుపరి 200 పైగా కిషన్ క్రెడిట్ కార్డులను పాడి రైతులకు అందించిన గోపాలమిత్ర వెంకటసుబ్బయ్యను అభినందించి శాలువా, మేమెంటో తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏడి డాక్టర్ కేడి వరప్రసాద్, డాక్టర్ భువనేశ్వరి, గోపాలమిత్ర శివ సిబ్బంది నాయక్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు
.
Comments