top of page
Writer's picturePRASANNA ANDHRA

బిజెపి వైకాపాలు రాహు కేతువులు - తులసి రెడ్డి

బిజెపి వైకాపాలు రాహు కేతువులు - డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాహు కేతువులుగా దాపరిచాయని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ప్రొద్దుటూరులో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ప్రొద్దుటూరు కార్యక్రమంలో మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి దేశాన్ని అప్పుల భారత్ గా చేసిందన్నారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం 46 లక్షల కోట్లు అప్పు చేయగా 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం 109 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందన్నారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు, ఇండియా ఇస్ ఫర్ సేల్ అన్నట్లుంది గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది విమానాశ్రయాలు రైల్వేస్టేషన్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి లాంటి సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఎరువులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 140 డాలర్లు ఉండగా దేశంలో లీటర్ డీజిల్ 50 రూపాయలకు లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు సరఫరా చేయడం జరిగింది మోడీ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్ కు 30 నుండి 60 డాలర్లు ఉన్నప్పటికీ దేశంలో లీటర్ డీజిల్ 100 రూపాయలకు లీటర్ పెట్రోల్ 112 రూపాయలకు ఉండడం శోచనీయమన్నారు.

మోడీ హయాం లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. మణిపూర్లో మానవ ఇతిహాసంలోనే కనివిని ఎరుగని విధంగా మారణ హోమం జరిగింది డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా మారింది. మోడీ పాలెం లో ప్రజలకు అచ్చే దిన్ కు బదులు చచ్చేదినాలు వచ్చాయి సబ్ కా వికాస్ బదులు సబ్కా వినాష్ జరుగుతోంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసింది ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో సేల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవును విస్మరించింది పోలవరం ప్రశ్నార్థకమయ్యింది విజయవాడ విశాఖ మెట్రో రైలు ఉసే లేదు. విశాఖ కొత్త రైల్వే జోన్ లేదు విశాఖ ఉక్కు కర్మాగాలని అమ్మకానికి పెట్టిందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది కేవలం నాలుగు సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని రుణాంద్రప్రదేశ్గా మార్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు రౌడీలు రాజ్యమేలుతున్నారు అరాచక ఆంధ్ర ప్రదేశ్ అయింది ఆఫ్గానిస్థాన్ లో తాలిబాన్ల పాలనను మించిపోయిందని అన్నారు.

ల్యాండ్ సాండ్ వైన్ మైన్ ఎర్రచందనం ఎర్రమట్టి సబ్సిడీ బియ్యం మాఫియాలు స్వైర విహారం చేస్తున్నాయి అవినీతి ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. రాష్ట్రం మధ్య ఆంధ్ర ప్రదేశ్ బూతాంధ్రప్రదేశ్ బూతుల ఆంధ్ర ప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్లో తయారయింది. కరెంటు చార్జీలు ఆర్టీసీ చార్జీలు మద్యం ఇసుక పెట్రోలు డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు బాదుడే బాదుడు అన్నట్లుంది. అప్పుడు ఫుల్ అభివృద్ధిని సంక్షోభంలో సంక్షేమం అన్నట్లుంది. అమ్మ ఒడి నాన్న పుట్టికి చాలడం లేదు నవరత్నాలు నకిలీ రత్నాలయ్యాయి ఆరోగ్యశ్రీ అనారోగ్య స్త్రీ అయింది మాట తప్పడం మడమ తిప్పడం దినచర్య అయింది రైతులు రగిలిపోతున్నారు మహిళలు మందుబాబులు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు యువత ఆగ్రహా వేషాల్లో ఉంది ఈ నేపథ్యంలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావలసిన చారిత్రక ఉంది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమం అమలవుతుంది. 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 ఆర్థిక సహాయం సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ అమలు పోలవరం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం రాజధానితో సహా విభజన చట్టంలో పేర్కొనబడి అపరితంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం. జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తూ ఉంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలం గా ప్రకటించకపోవడాన్ని శోచనీయమన్నారు.. పునః పరిశీలన జరిపి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపాదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంత్యాకుమారి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ పాలన వంట గ్యాస్ సిలిండర్ 410 రూపాయలకే సరఫరా చేయగా మోడీ ప్రభుత్వం ₹1000 దాటడం గ్రహీయమన్నారు జగన్ పాలనలో రాష్ట్రము మద్యం ఏరులై పారుతుంది అన్నారు. తాగుబోతులు మహిళలు తాళిబొట్లు తాకట్టు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, ప్రొద్దుటూరు అసెంబ్లీ సమన్వయ కమిటీ కన్వీనర్ సుబ్రహ్మణ్య శర్మ, తదితరులు పాల్గొన్నారు.

106 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page