రాహుల్ గాంధీ పై రాజకీయ కక్ష కట్టిన మోదీ - అత్తింజేరి శ్రీనాథ్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఒక పనికిమాలిన కేసులో రాహుల్ గాంధీకి శిక్షవేసి ఆ కారణంతో లోక్ సభ సభ్యత్వన్ని రద్దు చేయడం మోడీ నియంతృత్వం పాలనకు నిదశ్శనమని.. రాహుల్ గాంధీ పై నరేంద్ర మోడీ రాజకీయ కక్ష కట్టారని ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ అన్నారు.
బుధవారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేవలం మోడీ ఆధాని చీకటి కుంభకోణలను రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రశ్నించటం వల్ల రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం సిగ్గు చేటని.. ఈ విషయం దేశప్రజాలు గమనిస్తున్నారని అన్నారు. ఇది ప్రజా స్వామ్యనికి చీకటి రోజు అని.. దేశంలో నిర్బంధము, నియంత పాలన నడుస్తుందని అన్నారు. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యనికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని అన్నారు. దేశ ప్రజల హక్కుల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ఆపటం ఎవరి తరము కాదని తెలిపారు.
ఎయిర్ పోర్టులను, దేశ సంపదను, ఆక్రమంగా అదానికి కట్టబెట్టేందుకు మోదీ నిబంధనలను కూడా మారుస్తున్నారన్నారు. కోర్టు తీర్పు వచ్చాక ..బెయిల్ ఇచ్చి 30 రోజుల సమయం గానీ.. 24 గంటలు గడవకముందే అనర్హత వేటు ప్రకటించటం దుర్మార్గమని.. వెంటనే ఈ నిర్ణయం వేనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments