పెరిగిన ఆదరణ పోటీపడుతున్న నాయకులు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు, ప్రసన్న ఆంధ్ర - ఏప్రిల్ 17
గడచిన దశాబ్ద కాలంగా 2004 నుండి 2024 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు ప్రజలకు విధితమే వాటి గురించి మరల ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు అయితే విభజన హామీతో లాభపడాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి నాడు అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ చుక్కేదురయింది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నత పదవులు అనుభవించిన పలువురు నాయకులు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీని వీడి పలు ప్రాంతీయ పార్టీలలో చేరటం జరిగింది నాడు వైయస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు చురగొని వైయస్సార్ ను రెండు దఫాలు ముఖ్యమంత్రిగా చేసింది. విభజన నేపథ్యంలో పూర్తిగా తన హవాను పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకానొక సందర్భంలో అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది అనటం లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు? తాగా దివంగత వైయస్సార్ కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. నాటినుండి షర్మిలకు ప్రజలలో ఉన్న క్రేజ్ వలన ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు నాడు అనగా 2014 2019 సార్వత్రిక ఎన్నికలలో కనీసం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయటానికి ముందుకు రాని నాయకులు నేడు అదే పార్టీ టికెట్ కోసం పోటీ పడుతుండటం ఇక్కడ విశేషం.
కొందరు నాయకులు అయితే పార్టీలకు ఫిరాయింపులు ఎక్కడ తమకు టిక్కెట్ లభిస్తుందో ఎక్కడ తమకు తమ అనుయాయులకు పబ్బం గడుస్తుందో అక్కడికి వెళ్లిన నేతలు ఎందరో ఉన్నారు కానీ వీరందరికీ భిన్నంగా గడచిన నాలుగు దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకుని ఆ పార్టీలోని నాయకుల గెలుపుకు కృషి చేస్తూ ముఖ్యంగా నాడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైయస్సార్ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల వరదరాజుల రెడ్డి గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం తెచ్చుకొని వారి గెలుపు కోసం కృషి చేసిన షేక్ పూల మహమ్మద్ నజీర్ ను కాంగ్రెస్ పార్టీ విస్మరించనుందా లేక ఆయన పార్టీకి చేసిన సేవలు పలు పార్టీలలోకి ఆయనను ఆహ్వానించినను సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన ధైర్యాన్ని మొండితనాన్ని మెచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేయనుందా వేచి చూడాలి? శనివారం సాయంత్రం ప్రొద్దుటూరులో న్యాయ్ యాత్ర లో ప్రసంగించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇక్కడి అభ్యర్థి పేరు ఖరారు చేయని నేపథ్యంలో, టికెట్ ఆశిస్తున్న నాయకులలో ఉత్కంఠత పెరిగిపోయింది.
పార్టీకి చేసిన సేవలు సీనియారిటీ విషయానికి వస్తే 1985లు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన షౌకత్ అలీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నాడు షేక్ పూల మహమ్మద్ షరీఫ్ ఆయన గెలుపుకు కృషి చేశారు. షరీఫ్ కుమారుడు అయిన షేక్ పూల మహమ్మద్ నజీర్ 1989 నుండి కాంగ్రెస్ పార్టీలో తన వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతుండగా, ఈ నేపథ్యంలో 1991లో మైనారిటీ సెల్ సెక్రెటరీగా, 1996లో కడప జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 1999 నుండి 2004 వరకు ప్రొద్దుటూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, 2005 నుండి 2010 వరకు ప్రొద్దుటూరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, 2011లో కడప జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, 2012 నుండి 2014 వరకు ఇక్కడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, 2014 నుండి 2019 వరకు ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 నుండి నేటికీ ప్రొద్దుటూరు అసెంబ్లీ ఇన్చార్జిగా, 2024లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన వంతుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న షేక్ పూల మహమ్మద్ నజీర్ ను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తే ప్రజలలోకి ఇదొక నెగిటివ్ బలహీనమైన సంకేతంగా వెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు, షర్మిలమ్మను ఆదరించే వారికి నెగెటివ్ సంకేతం వెళుతుంది ఎందుకనగా గడచిన దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకొని వివిధ విభాగాలలో తన వంతు పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకునికి పార్టీలో ఉన్నప్పుడు టికెట్ ఇవ్వకపోవడం బలహీనమైన సంకేతంగా అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ప్రొద్దుటూరులోని కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీని నమ్ముకుని ఎంత పని చేసినా డబ్బు ఉన్న వారికే టికెట్ ఖరారు చేస్తారు అన్నది ఇక్కడ ప్రజలలోకి వెళ్లే సంకేతం. ప్రజలలో జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరగటం వలన నాయకులు పార్టీలు మారటం సహజమే. అయినప్పటికీ ఒకే పార్టీని నమ్ముకుని తన సేవలను అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఒక నాయకుడిని ఏదైనా పార్టీ విస్మరించింది అంటే అది వారి పతనానికి నాంది అక్కడే మొదలవుతుంది చెప్పాలి.
Comments