top of page
Writer's pictureEDITOR

దేశాన్ని మోదీ అమిత్ షా దుష్టుల నుంచి కాపాడుకోవడానికే రాహుల్ గాంధీ జోడో పాద యాత్ర - అత్తింజేరి

దేశాన్ని మోదీ అమిత్ షా దుష్టుల నుంచి కాపాడుకోవడానికే రాహుల్ గాంధీ జోడో పాద యాత్ర - అత్తింజేరి

సమావేశంలో ప్రసంగిస్తున్న అత్యంజేరి శ్రీనాథ్

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా దుష్టులు చేతుల్లో నుంచి కాపాడానికే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మిర్ వరకు కోట్లాది మంది భారతీయుల తో 3.500 కి. మీ. మేర నడిచి భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారని ఏపీసీసీ కార్యవర్గ అత్తింజేరి శ్రీనాథ్ అన్నారు. గురువారం రాజంపేట ఆర్ అండ్ బి అతిథి గృహంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కరపత్రాన్ని, రాహుల్ గాంధీ లేఖ ను విడుదల చేశారు. అనంతరం ఆయిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర విజవంతం అవ్వడంతో మోదీ, అమిత్ షా లకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు.


బీజేపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవని చెప్పారు. భారత్ జొడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని, ఈ యాత్రను రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాలకు వాడుకొలేదని., ఈ యాత్ర ఎన్నికల కోసం చేపట్టింది కాదని, దేశ శ్రేయస్సు కోసం దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేష వాతావరణాన్ని చెదరగొట్టి దేశం లో ప్రేమ-అభిమనాలను నెలకొల్పడం కోసం యాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. రోజు రోజుకు నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నారని అన్నారు.

బీజేపీ పాలనలో సామాన్య ప్రజలు జీవించడానికి కష్టంగా మారిపోయిందని అన్నారు. దేశ ప్రజలు మోడీ-షా ల అధికార కాంక్షను, ప్రభుత్వాల ఏర్పాటుకు ఎంతకైనా దిగజారడం, అందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరు జుగుప్సకరంగా ఉందని, ప్రజలు వీరి తీరును గమనిస్తున్నారని, బిజెపి పాలనతో దేశవ్యాప్తంగా ప్రజలు విసుగుచెందారని, మతతత్వాన్ని దేశభక్తిగా ప్రచారంచేస్తూ పబ్బంగడుపుకుంటున్న బిజెపి ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలనుకుంటున్నారని, భారత్ జోడో యాత్రతో అది స్పష్టమైయ్యిందని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృతంలో 2024 కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవుతారని అన్నారు.


ఈ కార్యక్రమం లో డీసీసీ ఉప అధ్యక్షులు కె.సుబ్రహ్మణ్యం, డీసీసీ కార్యదర్శి పాండురంగయ్య, మండల అధ్యక్షులు లేబాకు రవి, పట్టణ అధ్యక్షులు షైక్ మహమ్మద్, కాంగ్రెస్ పార్టీ నందలూరు అధ్యక్షులు సుబ్బరాయుడు, నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

15 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page