వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నేడు స్థానిక ఆర్.అండ్.బి అతిధి గృహం నందు కడప జిల్లా డీసీసీ అధ్యక్షుడు తులసిరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు, రాహుల్ గాంధీ చేపట్టిన భరత్ ఐక్యత యాత్ర ప్రధానోద్దేశం కేంద్రంలోని బీజేపీని రాష్ట్రంలోని వైసీపీని గద్దె దించటమేనని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తలపెట్టిన ఈ యాత్ర రాష్ట్రంలో పద్నాల్గవ తేదీ నుండి ఇరవైయవ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలు పాల్గొనే విధంగా తాము ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన గురించి ఆయన నిప్పులు చెరిగారు, జీడీపీ ని అంకెల గారడిగా అభివర్ణించారు, అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రైతులకు ఎరువుల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయని మండిపడ్డారు.
ముఖ్యంగా రాబోవు ఎన్నికల్లో అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువస్తామని, విభజన చట్టం లోని అంశాలను అమలు చేసి, వ్యవసాయ రుణాల మాఫీ, గ్యాస్ బండను అయిదు వందల రూపాయలకే అందిస్తామని, న్యాయ పధకం క్రింద నిరుపేద కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించి, ప్రత్యేక హోదా అమలుతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ కొరకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
గత మూడు సంవత్సరాల వైసీపీ పాలనను ఆయన అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అమలు చేస్తున్నారు అన్న చందంగా వివరించారు. అప్పుల పరంగా దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించారని, సంక్షేమ పధకాల ద్వారా వచ్చిన రుణాలు తిరిగి అధిక ధరల రూపేణా ప్రభుత్వానికె చెందుతోందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలం శ్రీనివాస రావు, నియోజకవర్గ ఇంచార్జి నజీర్ అహమ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్య శర్మ, ప్రధాన కార్యదర్సులు రామకృష్ణ, కాంగ్ర్రెస్ నాయకులు ఉదూద్ ఖాన్, ఉత్తన్న, ఓబయ్య, సైమన్, ఖాజా వల్లి, సుబ్బరాముడు, జావీద్, శామీర్ అలీ, రామాంజనేయులు, అమీర్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments