ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర వార్త
అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు విజయం సాధించారు. అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి ద్వారా ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు వారి ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగినది దీనిలో ప్రధానంగా డిమాండ్లు
1,డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెహికల్ పాస్ ఇస్తారు,
2. ప్రమాద బీమా12 లక్షలు చేయుటకు డ్యూటీ కీ గంట ముందు డ్యూటీ గంట తరువాత ప్రమాదం జరిగితే.
3, అంబ్లెన్స్ ప్రమాద స్థలం నుండి ఫస్ట్ ఎయిడ్ నుండి ఈ ఎస్ ఐ, నుండి రిఫ్రేల్ హాస్పిటల్ వరకు ఇస్తారు.
4,ఫుల్ & ఫైనల్ పెండింగ్ ఉన్న అన్నీ క్లియర్ చేస్తామన్నారు,
5, ఆధార్ కార్డు సమస్యలు క్లియర్ చేస్తామన్నారు,
6, లక్ డౌన్ (వర్క్ ఫ్రొం హోమ్ ) జీతాలు విషయం ఏప్రియల్ 15, తేది లోపు ఆర్ ఎల్ సి గారి సమక్షంలో మాట్లాడి చెల్లిస్తామని అన్నారు.
7.కాంట్రాక్టు కార్మికులు వేతన ఒప్పందం ఎన్ జె సి ఎస్ సమావేశంలో తేలిన తరువాత జీతాలు పెంచితామని అన్నారు,
8.డిపార్ట్మెంట్ ల లో కాళీ ఆయన కాంట్రాక్టు కార్మికుల స్థానం లో వెంటనే (డి పీ )నిర్వాసితులచే భర్తీ చేయుటకు అంగీకారంకావున స్టీల్ కాంట్రాక్టు కార్మికులు ఈ రోజు నైట్ డ్యూటీ నుండి విధలకు హాజరు కావాలని కోరుచున్నాము అని కోరారు.
ఈ పోరాటానికి అఖిలపక్ష కార్మిక కాంట్రాక్టు కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతో మేలు కరంగా చేసి వారి యొక్క భవిష్యత్తు కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని తెలిపారు
సి .ఐ .టి .యు సుబ్రహ్మణ్యం , రమణ ఏ.ఐ.టీ.యూ.సీ నంది తాతారావు ,మంత్రి రవి , వై. ఎస్. ఆర్ .టి. యు .సి.పిట్ట రెడ్డి, బొడ్డు గోవిందు ఇతర కార్మిక సంఘాలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది
Comments