వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటరులో తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశం గొడవ నియోజకవర్గ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది, ఆరోపణలు ప్రత్యారోపణలు నడుమ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే సందిగ్ధత ఏర్పడింది. కాగా మొన్న టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు వైసీపీ శ్రేణులు. నేడు 4వ వార్డు వైసీపీ కౌన్సిలర్ వరికూటి ఓబుల రెడ్డి కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో 32వ వార్డు కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి పనులలో భాగంగా 520 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారని, అందులో భాగంగానే మునిసిపల్ పరిధిలోని 41 వార్డులలో సీసీ రోడ్లు, కాలువలు, పూడికతీత, మంచినీటి, పైప్లైన్ పనులు వేగవంతం అయ్యాయని, స్థానిక ఏం.ఎల్.ఏ కౌన్సిలర్లను అందరిని సోదర భావంతో చూస్తున్నారని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారని, ఇర్ఫాన్ కౌన్సిలర్ గా ఉన్న 13వ వార్డులో కూడా 66 లక్షల 67 వేల రూపాయల మునిసిపల్ నిధులతో పనులు చేశామని, ఎక్కడో చిన్న విబేధాల కారణంగానే కౌన్సిల్ సమావేశంలో గొడవ జరిగిందని, 13వ వార్డులో పైప్లైన్ పనుల నిమిత్తం 07.05.2021 నాడు మునిసిపల్ చైర్మన్, కమీషనర్ లకు లిఖితపూర్వకంగా ఇర్ఫాన్ లెటర్ రాసారని, అందుకు ఆమోదం తెలుపుతూ 1.97 లక్షల నిధులతో 19.06.2021 నాడు పనులకు టెండర్ పిలిచి కమీషనర్, చైర్మన్ ఆమోదం తెలిపారని, ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇప్పటికి అయిదు సార్లు కాంట్రాక్టు బిడ్డర్లను ఆహ్వానించగా, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాయలేదని తెలిపారు. అయితే ఈ విషయమై ఇర్ఫాన్ కి అవగాహన లేదని, చిన్నపాటి విబేధాల కారణంగానే గొడవ జరిగిందని, దీనిని టీడీపీ బూతద్దంలో చూపిస్తూ, నియోజకవర్గ ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు గొడవ పడిన సందర్భాలను గుర్తు చేశారు. ఒక్క 13వ వార్డులోనే కాక మిగతా వార్డుల్లో కూడా కొన్ని పనులకు కాంట్రాక్టర్లు బిడ్డర్లు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి 32వ వార్డు కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments