వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
అసమ్మతి వైసీపీ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఖాజా, మునీర్, గౌస్, మురళీధర్ రెడ్డిలు శుక్రవారం మధ్యాహ్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖంధించారు, జగనన్న కాలనీలో బేస్ మట్టం నిర్మాణానికి తాను అరవై ఆరు మంది లబ్ధిదారుల దగ్గర మాత్రమే డబ్బులు తీసుకున్నానని, మీనాపురం జగనన్న కాలనీలో బ్లాకుల వారిగా విభజించిన ఫ్లాట్లలో తాను పనులు చేపట్టిన మాట వాస్తవమేనని, కాగా మిగులు పది ఫ్లాట్లకు ఫ్రంట్ భీములు ఏర్పాటు చేయవలసి ఉందని, మరో పదహారు ఫ్లాట్లలో భీములు ఏర్పాటు చేయవలసి ఉండగా, ఇక్కడ ఏటువంటి సౌకర్యాలు లేవని, కంప పెరగటం వలన, మునిసిపల్ అధికారులు ప్లానింగ్ ప్రకారం దారులు ఏర్పాటు చేయనందున, బోర్లు వేయక నీటి లభ్యత కరువైన కారణంగానే తాను నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని, మౌలిక వసతులు కల్పించిన తరువాతే తాను నిర్మాణ పనులు మొదలు పెడతానని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. మునిసిపల్ కమిషనర్ కు ఈ విషయమై పలుమార్లు విన్నవించినా ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని కోరారు. మైనారిటీ వర్గానికి చెందిన తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయటం సబబు కాదని హితువు పలికారు.
תגובות