మంత్రి బొత్సకు మేమంటే ఏంటో చూపిస్తాం :
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమ్మెకు సిద్ధమవుతోంది. మే 5న తమ డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీజీఈఏ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. రెండు దశల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని ఈ సందర్భంగా ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.
మే 22న జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. జూన్ 14న జిల్లా కేంద్రాల్లో సీపీఎస్ రద్దు కోసం పోరాటం, జులై 5, 6న నంద్యాల, కర్నూలులో బహిరంగ ప్రదర్శనలు చేస్తామని సూర్యనారాయణ చెప్పారు. అక్టోబరు 31న చలో విజయవాడ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబరు 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని సూర్యనారాయణ తేల్చి చెప్పారు. ఉద్యోగుల ఆగ్రహం ఎలా ఉంటుందో మంత్రి బొత్సకు చూపిస్తామన్నారు.
Comments