తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, చొప్పెల్ల, పెద్దపల్ల, ఆలమూరు పలు హాస్పిటల్ తో పాటు, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం మండలాలలో పలు గ్రామాల్లోని కొవిడ్ పరీక్షలు గవర్నమెంట్ ఆసుపత్రి ద్వారా చేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ పరీక్షలు చేయించుకునే వారు చాలా మంది ఉన్నారు. వారికి 24 గంటల లోపల రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటే, వారి ఆరోగ్యాలను తమరు కాపాడిన వారు అవుతారని, ఈ కోవిడ్ పరీక్షల రిజల్టు 3, 4 రోజుల తర్వాత వచ్చిన లేటుగా వచ్చిన తర్వాత ఈలోపులో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్యము క్షీణించడం, ప్రాణాలమీదకు వచ్చి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి, తమరు వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బందిని మేల్కొలిపి, కోవిడ్ రిజల్ట్ ను 24 గంటల్లో సంబంధితులకు, గవర్నమెంట్ ఆసుపత్రి వారు సమాచారము అందజేసిన ఎడల, పాజిటివ్ ఉన్నవారి ప్రాణాలను తమరు కాపాడిన వారవుతారని, పలు గ్రామాల్లో చాలా మంది కోవిడ్ రిజల్టు ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వారు తెలియజేయడం వలన పలువురు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయం మీద పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ, (ప్రెస్, మీడియో) మాతో పలువురు ఆందోళన, విచారంగా ఉన్నారని,చెందుతున్నారని, ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో రాయుడు లక్ష్మణరావు అనే నేను తమకు తెలియజేయుచున్నాను సార్. తమరు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
top of page
bottom of page
Comments