సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల వద్ద ధర్నా విజయవంతం - నిత్యవసర, డీజిల్, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్.
పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్,డీజిల్,నీటి పన్ను,చెత్త పన్ను తగ్గించాలని రాయచోటి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో ఉన్న, చిట్వేల్ గ్రామ సచివాలయం,2 నేతి వారి పల్లి. నగిరి పాడు, మైలపల్లి, ఫోలోపల్లి, గ్రామ/ వార్డు సచివాలయాల కార్యదర్శులకు వినతి పత్రం అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు, మలిశెట్టి జతిన్, సిపిఐ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్ లు మాట్లాడుతూ... పెరిగిన ధరలతో మన దేశంలోని సామాన్య ప్రజలు, కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ ఈ కేంద్ర ప్రభుత్వం ధరలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందింనదని వారన్నారు. ఇక ఈ కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్ర నుంచి మేల్కొనకపోతే భవిష్యత్తులో 120 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర 250 రూపాయలకు పెరిగే అవకాశం మరియు ప్రమాదం ఉందనీ;అలాగే వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ భవిష్యత్తులో రెండు వేల రూపాయల పెరిగే ప్రమాదం ఉందని; లీటర్ నూనె భవిష్యత్తులో 300 నుంచి 400 రూపాయల వరకు పెరిగినా ఆశ్చర్య పోవాల్సినటువంటి పరిస్థితి ఉండదనీ; భవిష్యత్తులో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరే ప్రమాదం లేక పోలేదని... దీనివలన మనదేశంలో ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి.. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కఠోరమైన పేదరికంలోకి దిగజారే ప్రమాదం ఎంతో దూరంలో లేదన్నారు.
ఎరువుల మరియు పిచికారీ మందుల ధరలు విపరీతంగా పెంచడం తో చాలామంది రైతుల అప్పులు చేసి కొన్నను పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నిత్యం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం రైతు పండించినటువంటి వ్యవసాయ పంటకు అదేవిధంగా ఉద్యాన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్టు వంటి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని మలిశెట్టి జతిన్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొనివచ్చి మోటార్లకు మీటర్లు బిగించాలనే యోచనలో ఉన్నదని ఫలితంగా అందరికీ అన్నం పెట్టే రైతన్న వ్యవసాయం నిర్మించుకుంటే దేశం అధోగతి అవుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు లో ఉన్నటువంటి భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈకేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలనిఉపాధి హామీ
పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని , దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, వీటితో పాటు రాష్ట్రంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలేరు-నగరి,హంద్రీ-నీవా లాంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి కరువు సమయంలో రాయలసీమ లో ఉన్నటువంటి ప్రాంతాలకు, ప్రజలకు తాగునీరు అందేవిధంగా సాగునీరు ఇబ్బంది లేకుండా
చూడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా కన్వీనర్ కేశం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం చిట్వేల్ మండల కార్యదర్శి సామ గంగయ్య, సిపిఐ గ్రామ కార్యదర్శి చుక్కా రామయ్య, ఆటో యూనియన్ నాయకులు పెంచలయ్య, మనీ, అశోక్, వెంకటేష్, నరేష్, మల్లికార్జున, రాజు, సిపిఐనాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments