శ్రీకాళహస్తి నియోజకవర్గం: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న టీచర్లు,వారి నాయకులపై అప్రజాస్వామికంగా నిర్బంధించడం ,అరెస్టులు చేయడం దుర్మార్గం చర్య అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు ఆయన ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ పోలీసులు ఉపాధ్యాయులపై జులుం ప్రదర్శించడం సరికాదన్నారు వేతన సవరణ వల్ల PRC జీతాలు తగ్గడం సిగ్గుచేటని విమర్శించారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చింతామణి నాటకాన్ని రద్దు చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కే తగదని అని ఎద్దేవా చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని జరగబోయే కార్యక్రమాల్లో తమ పార్టీ నాయకులు అవసరమైతే ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలియజేస్తారని ఆయన స్పష్టం చేశారు.
ప్రసన్న ఆంధ్ర. రిపోర్టర్. Vm మణికంఠ
Comments