సిపిఐ(ఎం) 23వ జాతీయ మహాసభల సందర్భంగా ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కామనురు శ్రీనువాసులురెడ్డి,బి.దస్తగిరి రెడ్డి,ఏ. రామాంజనేయులు సోమవారం నాడు సీపీఎం కడప జిల్లా కార్యలయం విడుదల చేశారు.కామనురు. శ్రీనువాసులురెడ్డి మాట్లాడుతూ
సిపిఐ(ఎం) 22వ మహాసభ తరువాత కాలంలో ఫాసిస్టు ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండాను అధికారంలో ఉన్న బిజెపి దూకుడుగా ముందుకు తెస్తూ మరింత పటిష్టవంతం అవుతుండడం చూస్తున్నాము అని, 2019 ఎన్నికల తరువాత మతపరమైన జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎక్కువ సీట్లు,అధిక శాతం ఓట్లతో బిజెపి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అప్పటి నుంచి మత సమీకరణ దూకుడు పెంచి మన లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగ పునాదులను దెబ్బతీస్తూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేయడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఎ అధికరణలను రద్దు చేయడం, రాజ్యాంగ వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), అయోధ్యలో ఆలయ నిర్మాణం ప్రారంభించడం వంటివి చేపట్టిందని. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన అతి పెద్ద,అత్యంత సుదీర్ఘ పోరాటం చారిత్రాత్మక విజయంతో ముగిసింది.ఈపోరాట ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసుకుంది.
ఈనాలుగు సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం అమెరికా వ్యూహాత్మక,రాజకీయ,భద్రతా పన్నాగాలకు పూర్తిగా లంగిపోయింది.అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్‌ను అత్యంత నమ్మకమైన బంటుగా మార్చింది. ఇది మన ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల పైన,భారత్ అంతర్జాతీయ స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నేటి భారతీయ పరిస్థితిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది అని అభిప్రాయ పడ్డారు.
Comments