కేరళ విధానాలు దేశానికి ఆదర్శం! సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతం!!
జిల్లా సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్.
కేరళ రాష్ట్రం సిపిఎం పార్టీ వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే దేశానికే ఆదర్శమని సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సిపిఎం పార్టీ జాతీయ మహాసభలు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళ రాష్ట్రం కానూరు జిల్లాలో విజయవంతంగా జరిగిందని; వేలాది మందితో,రెడ్ వాలెంటర్ మార్చింగ్, లక్షల మందితో బహిరంగ సభ జరిగిందన్నారు. ఈ మహాసభలు, కార్యకర్తలకు నూతన ఉత్సాహం ఇచ్చిందన్నారు.
సిపిఎం, వామపక్ష, లౌకిక విధానం కోసం, దేశ సమగ్రత సమైక్యత కోసం, సమర్థవంతమైన సమరశీల పోరాటాలు జరపాలనీ పిలుపునిచ్చారు. దేశంలో మతోన్మాద పార్టీ బిజెపి వారసులు దేశ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేదని, కాంగ్రెసు కమ్యూనిస్టులే దేశ స్వతంత్రం కోసం పోరాడీ సాధించారన్నారు. కానీ కాంగ్రెసు పెట్టుబడిదారుల కోసం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్మిక రైతులు పేద ప్రజల కోసం దోపిడీ లేని సమాజ కోసం ఏర్పడిందన్నారు. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం, మొట్టమొదట కేరళలో ఏర్పడిందన్నారు. లక్షల ఎకరాల భూములు భూస్వాముల నుండివ్యవసాయ కూలీల కోసం పంచిందిఅన్నారు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని తెలిపారు.
దేశంలోనే అక్షరాస్యత కేరళమొదటి స్థానంలో ఉందన్నారు. దేశంలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తూ, ప్రభుత్వ సంస్థల ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతూ,కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే కరోనా ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ లో ప్రజలను ఆదుకునీ ఆరోగ్య రంగంలో, వైద్యం అందించడంలో ముందుటూ తిరిగి రెండవసారి, అధికారంలోకి, పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా, రావడం నిదర్శనమన్నారు.
నేడు దేశంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వం అయినా, అనేక భాషలు మతాల కలయికైనా భారతదేశాన్ని లౌకిక రాజ్యంగం ద్వారా కొన్ని హక్కులు కల్పించబడ్డాయని, దానినీ నేడు ధ్వంసం చేస్తూ, ఆర్ ఎస్ ఎస్ మనువాద హిందూ మతోన్మాద సిద్ధాంతాన్ని, అమలు చేస్తున్నారని, అదేవిధంగా దేశంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంపదను, కార్పొరేట్లు, విదేశీ బహుళజాతి కంపెనీలకు, కారుచౌకగా కట్టబెడుతున్నారని తెలిపారు. ఏన్ ఆర్ సి, రైతు వ్యతిరేక చట్టాలను, సిపిఎం, వామపక్షాలు లౌకిక శక్తులు, అండతో తిప్పి కొట్టడం జరిగిందని గుర్తు చేశారు. అందుకే దేశంలో కేరళ మోడల్ ఎంతో అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఎం నాయకులు, లింగాల యానాదయ్య, కోడూరు సిపిఎం నాయకులు, సిగి చెన్నయ్య, చిట్వేల్, సిపిఎం నాయకులు పంది కాళ్ళ మణి, జై.సుబ్రహ్మణ్యం రాజు, దాసరి జయచంద్ర ,సిపిఎం పెనగలూరు నాయకులు, మద్దెల ప్రసాదు. తదితరులు పాల్గొన్నారు.
Commentaires